వరిగడ్డి వాము దగ్ధం | - | Sakshi
Sakshi News home page

వరిగడ్డి వాము దగ్ధం

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

మధిర: మండలంలోని నాగవరప్పాడులో ఆదివారం ప్రమాదవశాత్తు పల్లపోతుల నాగరాజుకు చెందిన వరిగడ్డి వాము దగ్ధమైంది. దీంతో రూ.35 వేల నష్టం వాటిల్లినట్లు ఆయన తెలిపాడు. కాగా, మంటలు మొదలుకాగానే స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు చేరుకుని మంటలను అదుపుచేశారు.

గోదాం నిర్మాణాన్ని అడ్డుకున్న ఆదివాసీలు

విగ్రహాలు ధ్వంసమవుతున్నాయని

ఆందోళన

కారేపల్లి: మండలంలోని గంగాదేవి గుట్టపై గోదాం నిర్మాణ పనులను గుట్టకింద గుంపు గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ఇక్కడ గోదాం నిర్మాణానికి ఇటీవల రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ శంకుస్థాపన చేశారు. అయితే, గోదాం నిర్మాణం పేరుతో ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన గంగాదేవి గుట్టను ధ్వంసం చేయడం సరికాదని ఆదివాసీలు చెబుతున్నారు. తమ ఆరాధ్య దైవమైన గంగాదేవి గుట్ట, కాళికాదేవి, సమ్మక్క విగ్రహాలను విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాక గుట్ట మట్టిని తరలించి కాంట్రాక్టర్‌ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు మాట్లాడుతూ.. గోదాం నిర్మాణం పేరుతో గుట్టను గుల్ల చేస్తున్నారని, తద్వారా ఆరాధ్య దైవాల విగ్రహాలు విధ్వంసమవుతున్నాయని తెలిపారు. ఇకనైనా గోదాం నిర్మాణ పనులను నిలిపివేయాలని కోరారు. కాగా, ఆదివాసీల ఆందోళన విషయం తెలిసి ఎస్‌ఐ గోపి, సిబ్బందితో చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అనడంతో వెనుదిరిగారు.

ప్రత్యామ్నాయ

పంటలే మేలు

ఖమ్మంవ్యవసాయం: ఈ సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. ఈ విషయమై వ్యవసాయ, జల వనరులు, ఉద్యానవన, భూగర్భ జల వనరుల శాఖల ఆధ్వర్యాన గ్రామా ల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డీఏఓ విడుదల చేసిన ప్రకటనలోని సూచనలు ఇలా ఉన్నాయి.

●వర్షాలు ఆలస్యమైతే వరి సాగు చేసే రైతులు నాటు విధానానికి బదులుగా వెదజల్లే పద్ధతిని అనుసరించాలని సూచించారు. స్వల్పకాలిక వరి రకాలైన బీపీటీ–5204, ఆర్‌ఎన్‌ఆర్‌–15048, డబ్ల్యూజీఎల్‌–44, జేజీఎల్‌–1978, ఎంటీయూ–1010, జైశ్రీరామ్‌, హెచ్‌ఎంటీ సోనా వంటి రకాలు ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు వస్తాయని తెలిపారు.

●వర్షాభావ పరిస్థితులతో వరి, మొక్కజొన్న, పత్తి తదితర పంటల సాగు విస్తీర్ణం తగ్గిన పక్షంలో వాటి స్థానాన పెసర, మినుము, బొబ్బర, కంది, వేరుశనగ వంటి పంటలను సాగు చేయించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు డీఏఓ పేర్కొన్నారు. రైతులకు అవసరమైన పెసర విత్తనాలను ఆత్మనిర్భరత మిషన్‌ పథకం కింద రాయితీపై అందజేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement