‘నెట్‌బాల్‌’ విజేత హార్విగో హాస్టలర్స్‌ | - | Sakshi
Sakshi News home page

‘నెట్‌బాల్‌’ విజేత హార్విగో హాస్టలర్స్‌

Jun 8 2026 6:42 AM | Updated on Jun 8 2026 6:42 AM

ఖమ్మంస్పోర్ట్స్‌: రెండురోజులుగా ఖమ్మంలోని హార్వెస్ట్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహిస్తున్న నెట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. టోర్నీలో విజేతగా హార్విగో హాస్టలర్స్‌ నిలవగా, హార్వెస్ట్‌ చాలెంజర్స్‌, ఎవర్‌ గ్రీన్స్‌ ప్రాజెక్టు జట్లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ సందర్భంగా ఆయా జట్లకు హార్వెస్ట్‌ విద్యాసంస్థల కరస్పాండెంట్‌ పి.రవిమారుత్‌, ప్రిన్సిపాల్‌, నెట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా చైర్మన్‌ ఆర్‌.పార్వతీరెడ్డి ట్రోఫీలు అందజేసి మాట్లాడారు. క్రీడలు విద్యార్థుల జీవితంలో ముఖ్య పాత్ర వహించడమే కాక క్రమశిక్షణ, నాయకత్వ లక్ష ణాలు, ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రాంచైజీల బాధ్యులు డాక్టర్‌ రవికుమార్‌, దీప్తి, చల్లపల్లి ఆదిత్య, డాక్టర్‌ రాజ్‌కుమార్‌, డాక్టర్‌ అమర్‌నాథ్‌, డాక్టర్‌ బాలభాస్కర్‌, సత్యనారాయణ, నర్సింహారావు, ఫణికుమార్‌, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement