టేకులపల్లి: కష్టాలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదగా మాట్లాడి మానవీయ కోణంలో వ్యవహరిస్తూ వారికి న్యాయం చేయాలని, తద్వారా పోలీసుశాఖపై నమ్మకం పెరుగుతుందని ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణ, రిసెప్షన్ కౌంటర్, కంప్యూటర్, రికా ర్డుల గదిని పరిశీలించారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తుపై ఆరా తీశాక ఎస్పీ మాట్లాడుతూ.. స్టేషన్‌కు వచ్చే బాధితులతో, ముఖ్యంగా మహిళలు, వృద్ధులతో మర్యాదగా మాట్లాడి మానవీయ కోణంలో సమస్యలు తెలుసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరించారు. కాగా, నేరాల నియంత్రణకు రాత్రి వేళ గస్తీ పెంచడంతో పాటు పాత నేరస్తుల కదలికలపై దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ఇల్లెందు డీఎస్పీ వెంకన్నబాబు, టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి బోడు, ఆళ్లపల్లి ఎస్‌ఐలు అలకుంట రాజేందర్, పోలిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సోమేశ్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
టేకులపల్లి పీఎస్‌ను తనిఖీ చేసిన
ఎస్పీ రోహిత్‌రాజు


