భధ్రాచలం: గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లు, గురుకులాలు, ఈఎంఆర్‌ఎస్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో కూడిన మెనూ అమలు చేస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. విద్యాసంస్థలకు కూరగాయలు, పండ్లు, చికెన్, మటన్ సరఫరా చేయడంతో పాటు ఇతర పనులకు గాను శని వారం టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. మొత్తం 278 మంది టెండర్‌దారులు పాల్గొనగా పీఓ మాట్లాడుతూ అతి తక్కువ కోట్ చేసిన వారిని నిబంధనల ప్రకారం ఖరారు చేశామని తెలిపారు. తాజా కూరగాయలు, చికెన్, మటన్‌తో పాటు వారానికి ఐదు రోజులు అరటి పండ్లు, రెండు రోజులు ఇతర పండ్లు సరఫరా చేయాలని చెప్పారు. నాసిరకం సరుకులు సరఫరా చేసినట్లు తేలితే శాఖాపరమైన చర్యలతో పాటు మూడేళ్లు కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లో పెడతా మని తెలిపారు. ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన, ఈఈ మధూకర్, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల అధికారులు సమ్మయ్య, రమేష్, అశోక్‌కుమార్, చంద్రమోహన్, సత్యవతి, భారతీ దేవి తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


