సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులందరికీ చేర్చాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హులందరికీ చేర్చాలి

Jun 7 2026 3:45 AM | Updated on Jun 7 2026 3:45 AM

జూలూరుపాడు: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అందేలా అధికా రులు పర్యవేక్షించాలని పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ విద్యాలత సూచించారు. ఇందుకోసం గ్రామసభలను వేదికగా చేసుకోవాలని తెలిపారు. జూలూరుపాడు మండలం కాకర్ల రైతు వేదికలో శనివారం నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. తడి, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తే గ్రామాలు పరిశుభ్రంగా మారతాయని తెలిపారు. అనంతరం ప్లాస్టిక్‌ నిషేధం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి వీడియో ద్వారా అవగాహన కల్పించారు. అలాగే, స్వచ్ఛత, ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించగా, అధికారులతో కలిసి డిప్యూటీ కమిషనర్‌ విద్యాలత మొక్కలు నాటారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ అప్పారావు, డీఎల్‌పీఓ ప్రభాకర్‌, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంపీఓ తులసీరామ్‌, ఎంఈఓ బానోత్‌ జుంకీలాల్‌, సర్పంచ్‌ బానోత్‌ బుల్లి తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌

విద్యాలత

Advertisement
 
Advertisement
Advertisement