చండ్రుగొండ: మీ సేవా కేంద్రాల ద్వారా ధ్రువపత్రాల జారీ మరింత వేగంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు తెలిపారు. చండ్రుగొండలో శనివారం ఆయన చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి తహసీల్దార్లు, సిబ్బంది, మీ సేవ కేంద్రాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేంద్రాల నుంచి అందే దరఖాస్తుల పరిశీలన, జారీపై సమీక్షించాక మాట్లా డారు. సెంటర్ల నిర్వాహకులు నిర్దేశిత రుసుమే తీసుకునేలా పర్యవేక్షించాలని సూచించారు. అలా గే, డేటా ఎంట్రీలో పొరపాట్లు చేయకుండా అవగాహన కల్పించాలన్నారు. తహసీల్దార్‌లు జగదీశ్వరప్రసాద్, స్వర్ణ, జీపీఓలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.


