నేను రాసిన కథ | - | Sakshi
Sakshi News home page

నేను రాసిన కథ

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

కృతజ్ఞతాభావం..

అశ్వారావుపేట రూరల్‌: ఒక రాజ్యంలో కాంతవర్మ అనే రాజు పాలన చేసేవాడు. ఆయన కోపిష్టి కావడంతో ఎవరు ఏ చిన్న తప్పు చేసినా కఠినంగా శిక్షించేవాడు. రాజుగారి మామిడి తోటలో పనిచేసే శాంతయ్య అనే తోటమాలి మామిడి కాయల లెక్క పొరపాటుగా తప్పు చెప్పాడు. రాజుగారికి ఈ విషయం తెలిస్తే శిక్ష తప్పదని భావించి శాంతయ్య పారిపోతాడు. ఆ తర్వాత ఈ విషయం తెలిసిన రాజు.. శాంతయ్యను పట్టుకురమ్మని తన భటులను ఆజ్ఞాపిస్తాడు. దీంతో భటులు వెంబడిస్తుండగా శాంతయ్య పరుగులు తీస్తాడు. కొంత దూరం పరిగెత్తాక దాహంతో చెరువు వద్ద ఆగగా భటులు దగ్గరగా రావడంతో మళ్లీ పరుగు మొదలుపెడతారు. ఎదురుగా గుహ కనిపించడంతో అందులో దాక్కుందామని వెళ్తే సింహం కనిపిస్తుంది. వెనక్కి వెళ్తే భటులు.. ముందుకు వెళ్దామంటే సింహం ఉండడంతో ఏం చేయాలో పాలుపోక శాంతయ్య ఆలోచిస్తుంటాడు.

శిక్ష కంటే ఇదే మేలని..

ఇంతలోనే ఎదురుగా ఉన్న సింహం శాంతయ్యను గమనించి దగ్గరకు రమ్మని సైగ చేస్తుంది. భటులకు చిక్కితే రాజు కఠినంగా శిక్షిస్తాడు.. అంతకంటే సింహానికి ఆహారంగా మారడమే మేలు అనుకుని ఆయన దగ్గరకు వెళ్తాడు. ఆ సింహం శాంతయ్యకు తన కాలుని చూపిస్తుంది. కాలికి గాయమై రక్తం కారుతుండడాన్ని గమనించిన శాంతయ్య అక్కడి చెట్టు ఆకులను కోసి పసరు తీసి కట్టుకడతాడు. రెండు రోజులు అలాగే కడుతూ అక్కడే ఉంటాడు. మూడో రోజున ఆకలి తీర్చుకునేందుకు సమీపంలోని చెట్టు పండ్లు కోసుకునేందుకు వెళ్తాడు. ఈ విషయాన్ని భటులు గమనించి రాజుకు చెబుతారు. దీంతో రాజు ఆదేశాలతో శాంతయ్య బంధించి తీసుకెళ్లగా ఆయనకు సింహ భక్షణ శిక్ష విధిస్తాడు. ఆపై భటులు ఒక బోనులో సింహాన్ని ఉంచి అందులోకి శాంతయ్యను పంపిస్తారు. ఆపై సింహం గర్జిస్తూ శాంతయ్య దగ్గరకు రావడంతో ఆయన భయపడుతుండగా అది మాత్రం శాంతయ్య చుట్టూ తిరుగుతూ ఒంటిని ప్రేమగా నాకుతుంది. ఇది చూసి రాజు, ప్రజలంతా ఆశ్చర్యపోతారు. శాంతయ్య మాత్రం తాను వైద్యం చేసిన సింహం అదేనని గుర్తించి అది ప్రేమ చూపించిందని భావించగా.. రాజు వద్ద ఇన్నేళ్లు సేవలు చేసిన చిన్న తప్పుకే చంపాలని చూస్తున్నాడని అనుకుంటూ సింహానికి మనసులో కృతజ్ఞత తెలుపుకుంటాడు. ఆపై రాజు వివరాలు ఆరా తీయగా శాంతయ్య ఏనాడూ తాను తప్పు చేయలేదని.. మామిడికాయల లెక్క రోజున తన కూతురికి జ్వరం రావడంతో కంగారు పడ్డాడని చెప్పాడు. దీంతో మృగమే కృతజ్ఞత చూపించినప్పుడు తాను మాత్రం ఆవేశం చూపించడం సరికాదని గ్రహించిన రాజు అప్పటి నుంచి కోపాన్ని తగ్గించుకోవడం మొదలుపెట్టాడు.

నీతి : మనం చేసిన మేలు ఎప్పటికై నా

కృతజ్ఞతగా తిరిగి వస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement