మానసికోల్లాసం, సామాజిక
బాధ్యతలపై అవగాహన
మంచి మార్గంలో నడిపించేలా...
పాల్వంచ: వేసవి సెలవుల్లో పిల్లలకు నైతికల విలువలు నేర్పించడమే కాక సృజన్మాతకత వెల్లివిరిసేలా పలు ప్రధాన చర్చిల్లో వీబీఎస్(ఒకేషనల్ బైబిల్ స్కూల్) తరగతులను నిర్వహిస్తున్నారు. పిల్లలను ఆధ్యాత్మిక బాట పట్టించడమే కాక సామాజిక స్పృ హ పెరిగేలా ఈ తరగతులు తోడ్పడుతున్నాయి. ఆట పాటలతో కూడిన బోధన సాగుతుండడంతో వారు సంతోషంగా, ఉత్సాహంగా హాజరవుతున్నారు.
అందరికీ ప్రవేశం
సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు నేర్చుకునే విషయాలు వారు సమాజంలో బాధ్యతాయుతమైన, ఉత్తమమై న వ్యక్తులుగా ఎదగడానికి తోడ్పడుతాయని చెబుతున్నారు. 4–15 వయస్సు కలిగిన చర్చి సభ్యులే కాకుండా సమాజంలో పిల్లలందరికీ ప్రవేశం కల్పిస్తున్నారు. దీంతో పాటలు, నృత్యం నేర్చుకోవడమే కాక చిన్న వస్తువులు, గ్రీటింగ్ కార్డులు తయారుచేయడం, చిత్రాలు గీయడంపై శిక్షణ ఇస్తూ ఆటలు, క్విజ్, జ్ఞాపకశక్తి పోటీలు నిర్వహిస్తున్నారు. ఇవికాక మంచి నడవడిక, క్రమశిక్షణ, నిజాలే మాట్లాడడం, పెద్దలను గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం, క్షమించే గుణం వంటి నైతిక విలువలను నేర్పిస్తున్నారు. తద్వారా నిజాయితీ, క్షమాగుణం, ప్రేమ, కరుణ, ఇతరులను గౌరవించడం వంటి లక్షణాలు అలవాటవుతాయని, ఇతర పిల్లలతో కలిసి ఉండడంతో వల్ల కొత్త స్నేహాలు ఏర్పడి నలుగురితో ఎలా కలిసిపోవాలో తెలుస్తుందని చెబుతున్నారు.
చర్చిల్లో ప్రత్యేక
వీబీఎస్ తరగతులు
పిల్లలు చెడు స్నేహాలకు దగ్గరైతే అంతే త్వరగా చెడు అలవాట్లకు ఆకర్షితులవుతారు. అందుకే పిల్లలు, యువతను మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక సామాజిక చైతన్యం కల్పించి సృజనాత్మకతను వెలికి తీసేలా శిక్షణ తరగతులు దోహదం చేస్తున్నాయి.
– పాస్టర్ కె.టైటస్ లివింగ్ వాటర్,
ఎల్‌జీఎం చర్చి నిర్వాహకులు


