నిందితులకు శిక్ష పడేలా చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిందితులకు శిక్ష పడేలా చేయాలి

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

ఎస్పీ రోహిత్‌ రాజు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కోర్టు డ్యూటీ అధికారుల పాత్ర కీలకమని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో పనిచేస్తున్న స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు, కోర్టు డ్యూటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు కోర్టు డ్యూటీ అధి కారులకు కేసులపై అవగాహన కల్పించాలన్నా రు. సమన్లు, వారెంట్ల జారీలో జాప్యం చేయొద్దన్నారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యా యం చేసేందుకు కృషి చేయాలన్నారు. సీఐలు, ఎస్‌ఐలు, కోర్టు లైజనింగ్‌ ఆఫీసర్‌, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

కృషికా యాప్‌ను ఉపయోగించుకోవాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): రైతులు వ్యవసా య రుణాల కోసం కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఆవిష్కరించిన కృషికా ( krishika) యాప్‌ను వినియోగించుకోవాలని జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజరు రామిరెడ్డి శుక్రవా రం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన వ్యవసాయ రుణాలకు ఈ యాప్‌ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు.

రేపు జిల్లా సీనియర్‌

అథ్లెటిక్స్‌ ఎంపికలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఈనెల 7న చర్ల స్టేడియం (జెడ్పీహెచ్‌ఎస్‌ రోడ్‌)లో జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె.మహీధర్‌ శుక్రవారం తెలిపా రు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు ఈనెల 11వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ స్టేడియం, హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో 100 మీ, 200 మీ, 400 మీ. పరుగు, జావెలిన్‌ త్రో, లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌ విభాగాల్లో పాల్గొంటారని తెలిపారు. పురుషులు, మహిళలకు పోటీలు నిర్వహించనుండగా ఆసక్తి గల వారు ఈ నెల 7వ తేదీన ఉదయం 8 గంటలకు చర్ల స్టేడియంలో రిపోర్ట్‌ చేయాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్‌ నంబర్‌ 85220 67157ను సంప్రదించాలన్నారు.

డ్రండ్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ఆరుగురికి జైలు శిక్ష

బూర్గంపాడు/భద్రాచలంఅర్బన్‌: బూర్గంపాడు పోలీసులు ఇటీవల నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో 11 మంది పట్టుబడగా.. శుక్రవారం భద్రాచలం ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ శివనాయక్‌ తీర్పు వెలువరించారు. ఇందులో ఇద్దరికి ఒకరోజు జైలు శిక్ష, తొమ్మిది మందికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మేడా ప్రసాద్‌ మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు మద్యం సేవించరాదని, వాహనదారులు హెల్మెట్‌, సీటు బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలన్నారు. నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనాలు నడిపితే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న ఓ ఇద్దరిని బూర్గంపాడు పోలీసులు, మరో ఇద్దరిని భద్రాచలం టౌన్‌ పోలీసులు పట్టుకోగా న్యాయమూర్తి శివనాయక్‌ నలుగురికి ఒక్క రోజు జైలు శిక్షతో పాటు రూ.100లు జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement