‘ఎన్‌ఎంఎంఎస్‌’కు 66 మంది ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘ఎన్‌ఎంఎంఎస్‌’కు 66 మంది ఎంపిక

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

కొత్తగూడెంఅర్బన్‌/అశ్వారావుపేటరూరల్‌/జూలూరుపాడు: జిల్లాలో 2025 నవంబర్‌లో జరిగిన (నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌) ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. జిల్లా నుంచి 745 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 66 మంది అర్హత సాధించారని జిల్లా విద్యాశాఖాధికారులు తెలిపారు. గత సంవత్సరం 59 మంది అర్హత సాధించారని గుర్తు చేశారు. అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నాలుగేళ్లపాటు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుతుందని పేర్కొన్నారు. ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికై నవారిలో అశ్వారావుపేట ప్రభుత్వ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకుల వీరేన్‌ గంగాదుర్గ, బొల్లి మణిచందర్‌ రాజు, జూలూరుపాడు మండలం పాపకొల్లు పీఎం శ్రీ హైస్కూల్‌ విద్యార్థులు బి.వర్షిత, కె.మేఘన, జి.కృష్ణ మనోహర్‌లు ఉండగా, వారిని హెచ్‌ఎంలు పి.హరిత, ఎస్కే మీరా సాహెబ్‌, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement