సమష్టి సహకారంతోనే అవార్డులు | - | Sakshi
Sakshi News home page

సమష్టి సహకారంతోనే అవార్డులు

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

భద్రాచలం: ఐటీడీఏలో అన్ని యూనిట్‌ అధికారులు, సిబ్బంది సమష్టి సహకారాలతోనే ఐటీడీఏకు అవార్డులు, పురస్కారాలు లభిస్తున్నాయిని ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ అన్నారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డును అందుకున్న సందర్భంగా శుక్రవారం ఐటీడీఏలో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 9 అవార్డులు ప్రకటించగా, ఉత్తమ ఐటీడీఏగా భద్రాచలం ఎంపికై ందన్నారు. ఇదే స్ఫూర్తి తో మరింత ఉత్సాహంగా పని చేయాలని సూచించారు. అనంతరం కేక్‌ కట్‌ చేశారు. పీఓను ఘనంగా సత్కరించి వికాస రథసారథి బిరుదు, జ్ఞాపిక అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్‌ రాజ్‌, చందన, అరుణకుమారి, మధుకర్‌, ఉదయ్‌ కుమార్‌, చెంగల్‌ రావు, మణిధర్‌, రాంబాబు, వేణు, అశోక్‌ కుమార్‌, రమేష్‌, సైదులు, హరికృష్ణ, ఆదినారాయణ పాల్గొన్నారు.

ఐటీడీఏ పీఓ రాహుల్‌

Advertisement
 
Advertisement
Advertisement