పర్యావరణ ప్రతిన | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ ప్రతిన

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

●పర్యావరణ పరిరక్షణలో భేష్‌

జిల్లా వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలు నిర్వహించారు. కలెక్టర్‌ అంకిత్‌, ఎస్పీ రోహిత్‌ రాజు తదితరులు పలుచోట్ల మొక్కలు నాటారు. చెట్లను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఉద్బోధించారు.

రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్న

డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌

పాల్వంచరూరల్‌: పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్రస్థాయి పర్యావరణ అవార్డు లభించింది. రాష్ట్రవ్యాప్తంగా మహబూబ్‌నగర్‌లోని ఎన్‌టీఆర్‌ డిగ్రీ కళాశాల, కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళా శాల, పాల్వంచ డిగ్రీ (అటానమస్‌) కళాశాలలు అవార్డులకు ఎంపికయ్యాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, మండలి కార్యదర్శి రవి చేతుల మీదుగా ప్రిన్సిపాల్‌ పొలారపు పద్మ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు అందుకోవడం పర్యావరణ విజయాలకు గుర్తింపు అని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషి వేల్ల అవార్డు లభించిందన్నారు. కళాశాల ఎకో క్లబ్‌ కన్వీనర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement