పర్యావరణ వేడుకల్లో సింగరేణి డైరెక్టర్లు
రుద్రంపూర్: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, అందరూ విరివిగా మొక్కలు నాటాలని సింగరేణి డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారా యణ, వెంకటేశ్వర్లు, తిరుమలరావు అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్స వం నిర్వహించారు. అధికారులు పర్యావరణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ సింగరేణివ్యాప్తంగా 16,790 హెక్టార్లలో 6.68కోట్ల మొక్కలను నాటా మని, గనుల సమీప గ్రామాల్లో 2.32కోట్ల మొక్కలను పంపిణీ చేశామని తెలిపారు. ఇంకుడు గుంతల నిర్మాణం, సాగునీటి చెరువులు, అర్బన్ పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు గనుల ఆవరణలో 62 నీటి ట్యాంకులు తవ్వించామన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ లో అత్యుత్తమ మార్కులు సాఽధించిన ఖైరీగుడా ఓపెన్ కాస్ట్ గని, రవీంద్రఖని న్యూటెక్ అండర్ గ్రౌండ్ గనులకు ఉత్తమ ఎకో ఫ్రెండ్లీ అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఫారెస్ట్, ఎన్విరాన్‌మెంట్ జీఎం బి.సైదులు, కార్మిక నాయకులు వంగా వెంకట్, త్యాగరాజన్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


