●భావితరాల భద్రత | - | Sakshi
Sakshi News home page

●భావితరాల భద్రత

Jun 6 2026 12:11 AM | Updated on Jun 6 2026 12:11 AM

●భావితరాల భద్రత

జిల్లా ప్రధాన

న్యాయమూర్తి ప్రేమలత

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పర్యావరణ పరిరక్షణే భావితరాలకు భద్రతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.ప్రేమలత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం మొక్క నాటా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలన్నారు. అనంతరం న్యాయమూర్తి జెండా ఊపి పర్యావరణ ర్యాలీని ప్రారంభించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసుశాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు,ఎన్‌జీఓలు, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement