తెలుగును వారసత్వ సంపదగా అందించాలి | - | Sakshi
Sakshi News home page

తెలుగును వారసత్వ సంపదగా అందించాలి

Jun 5 2026 12:42 AM | Updated on Jun 5 2026 12:42 AM

తెలుగును వారసత్వ సంపదగా అందించాలి రూ.2.25 లక్షల విలువైన గంజాయి స్వాధీనం అక్రమ టేకు కలప స్వాధీనం ఎనిమిది ఎకరాల జామాయిల్‌ తోట దగ్ధం

భద్రాచలం: తెలుగు భాషను భావితరాలకు వారసత్వ సంపదంగా అందించాలని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈఓ దామోదర్‌రావు అన్నారు. గురువారం తన కార్యాలయంలో ప్రపంచ తెలుగు సాహితీ మహాసభల గోడపత్రికలు ఆవిష్కరించి మాట్లాడారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో రాజమండ్రి గ్లోబల్‌ యూనివర్శిటీలో ఈ నెల 6 ,7 తేదీల్లో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కవులు, సాహితీవేత్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మహాసభల సమన్వయకర్త సురేష్‌ బాబు తోటమల్ల, గుమ్మడపు దుర్గాప్రసాద్‌, అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

పాల్వంచరూరల్‌: అంతర్రాష్ట్రం నుంచి అక్రమంగా ద్విచక్రవాహనాలపై తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వివరాలిలా.. మండల పరిధిలోని కేశవాపురం గ్రామ పంచాయతీ సమీపంలోని బీసీఎం జాతీయ రహదారిపై ఖమ్మం ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్‌ఐ సీహెచ్‌.శ్రీహరిరావు ఆధ్వర్యాన గురువారం వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో భద్రాచలం నుంచి పాల్వంచ వైపు వస్తున్న రెండు స్పోర్ట్స్‌ బైక్‌లను అనుమానాస్పదంగా కన్పించడంతో ఆపి తనిఖీ చేశారు. దీంతో రూ.2.25 లక్షల విలువైన నాలుగు కేజీల 480 గ్రాముల ఎండు గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న కర్నూలుకు చెందిన షేక్‌.మహ్మద్‌ అవిజ్‌భాషా, పాసుపాల జగన్నాథ్‌, మల్కాన్‌గిరిలోని నాళ్లగండికి చెందిన ప్రసన్నదిత్‌ మండల్‌, ప్రితమ్‌రాయ్‌లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు బైక్‌లు, మూడు సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని పాల్వంచ ఎకై ్సజ్‌ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ దాడిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు ఎండీ.ఖలీల్‌ హమ్మద్‌, ఎస్‌కె.జమీల్‌ షరీఫ్‌, కానిస్టేబుళ్లు కె.ఉపేందర్‌, సీహెచ్‌.ప్రసన్న, యు.నాగరాజు, వి.శివకుమార్‌లు పాల్గొన్నారు.

గుండాల: ఓ రైతు చేనులో దాచి ఉంచిన టేకు కలపను ఆళ్లపల్లి ఫారెస్టు అధికారులు స్వాధీన పర్చుకున్నారు. రేంజర్‌ కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలో అనంతోగు గ్రామంలో ఓ రైతు చేను పక్కన గుర్తు తెలియని వ్యక్తులు టేకు కలపను దాచి ఉంచారు. దీంతో సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది తనిఖీ చేసి పట్టుకోగా.. వీటి విలువ సుమారు రూ. 3,60,771లు ఉంటుందన్నారు. అనంతరం స్వాధీనం చేసుకున్న కలపను పాల్వంచ డిపోకు తరలించామన్నారు. పరారైన దుండగుల కోసం దర్యాప్తు చేపట్టినట్లు రేంజర్‌ తెలిపారు.

కల్లూరురూరల్‌: పొలాల్లో వ్యర్థ్యాలను నిప్పు అంటించడంతో మంటలు ఎగిసి పడి జామాయిల్‌ తోట కాలిపోయిన ఘటన గురువారం కల్లూరులోని రామనగర్‌ కాలనీ వద్ద జరిగింది. రైతులు పలువురు పొలాల్లోని పంట అవశేషాలకు నిప్పు పెట్టగా వడగాలులతో మంటలు పెరిగి సమీపంలోని మద్దినేని శ్రీనివాసరావు కుటుంబానికి చెందిన ఎనిమిది ఎకరాల జామాయిల్‌ తోటకు అంటుకున్నాయి. దీంతో తోట పూర్తిగా కాలిపోగా, సమీపంలోని ఎకరం భూ మిలో వేసిన మల్లెపూల తోట కూడా చాలావరకు కాలిపోయింది. అంతేకాక సమీపంలోని మిల్లుల వద్దకు మంటలు చేరుతుండడంతో యజమానులు, హమాలీల అప్రమత్తమై ఆర్పడంతో ప్రమాదం తప్పింది. ఈమేరకు కల్లూరు మున్సిపల్‌ చైర్మన్‌ మోహన్‌నాయక్‌, కౌన్సిలర్లు ఎం.డీ.ఇస్మాయిల్‌, గుండ్ల పుల్లారావు, కాంగ్రెస్‌ నాయకులు పసుమర్తి చందర్‌రావు తదితరులు సత్తుపల్లిలోని అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడమే కాక మున్సిపాలిటీ ట్యాంకర్‌ తెప్పించి మంటలు ఆర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement