గాలివాన బీభత్సం... | - | Sakshi
Sakshi News home page

గాలివాన బీభత్సం...

Jun 5 2026 12:42 AM | Updated on Jun 5 2026 12:42 AM

ఎగిరిన ఇళ్ల పైకప్పులు.. విరిగిపడిన భారీ వృక్షాలు

విద్యుత్‌ వైర్లు పడి ఆవు మృతి

పినపాక: మండలంలో బుధవారం అర్ధరాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. బయ్యారం, ఎల్సీరెడ్డిపల్లి పంచాయతీలలో అర్ధరాత్రి గాలివాన దాటికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొన్ని ఇళ్లపై పడడంతో పాక్షికంగా దెబ్బతినగా.. అధికారులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు రాత్రి నుంచే వాటిని తొలగించే పనులు చేపట్టారు. పంచాయతీ అధికారులు జేసీబీ సాయంతో భారీ వృక్షాలను రోడ్లపై నుంచి తొలగిస్తున్నారు. గాలి దుమారానికి పలుచోట్ల ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి.

నిలిచిన విద్యుత్‌ సరఫరా..

మండలంలోని ఈ బయ్యారం, ఎల్సీరెడ్డిపల్లి గ్రామాల్లో కరెంట్‌ విద్యుత్‌ స్తంభాలు, వైర్లు తెగిపడడంతో అధికారులు 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. తక్షణ చర్యలో భాగంగా కొత్త విద్యుత్‌ స్తంభాలు, వైర్లు పునరుద్ధరించే పనిలో విద్యుత్‌ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. విద్యుత్‌ వైర్లు తెగిపడి బయ్యారం, కొత్త రెడ్డిపాలెం గ్రామంలో ఆవు మృతి చెందింది. దీంతో విద్యుత్‌ అధికారులు పంచనామా నిర్వహించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. అటు దెబ్బతిన్న ఇళ్లను తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సిబ్బంది పరిశీలించి సుమారుగా బయ్యారం పంచాయతీలో 15 ఇల్లు, ఎల్సీరెడ్డిపల్లి పంచాయతీలో 14 ఇళ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దెబ్బతిన్న ఇళ్ల వివరాలు నమోదు చేసుకుని, ప్రభుత్వం తరఫున వారికి సాయం అందజేస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement