ప్రజా చైతన్యమే కాంగ్రెస్‌ ఆయుధం | - | Sakshi
Sakshi News home page

ప్రజా చైతన్యమే కాంగ్రెస్‌ ఆయుధం

Jun 5 2026 12:42 AM | Updated on Jun 5 2026 12:42 AM

కొత్తగూడెంఅర్బన్‌: ప్రజా చైతన్యమే కాంగ్రెస్‌ ఆయుధమని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న తెలిపారు. గురువారం కాంగ్రెస్‌ పార్టీ సాంస్కృతిక సేన జిల్లా కమిటీకి నూతన పదవుల నియామక పత్రాల అందజేసిన సందర్భంగా ఆమె మాట్లాడారు. గత పదేళ్లుగా అణచివేయబడ్డ తెలంగాణ సంస్కృతికి, కళలకు కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వంలో పూర్వ వైభవం తీసుకొస్తామని, ఆరు గ్యారంటీలు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ వంటి పథకాలను పాటల రూపంలో గడపగడపకు తీసుకెళ్లాన్నారు. ప్రతిపక్షాల అబద్దపు ప్రచారాలను తిప్పికొట్టాలని నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్‌, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాస్‌రెడ్డి, సాంస్కృతిక సేన అధ్యక్షుడు కిన్నెర లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి జానకిరామ్‌, గౌరవ అధ్యక్షుడు గోను లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ముత్తుజ, కిన్నెరమణి, సాంస్కృతిక సేన మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు లక్ష్మీప్రసన్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement