గరిష్టం / కనిష్టం
370 / 280
జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది.
సమగ్ర అధ్యయనం చేపట్టాలి
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి
ఎమ్మెల్యే పాయం వినతి
బూర్గంపాడు: పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌తో పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై సమగ్ర అధ్యయనంతో నివేదికలు రూపొందించాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కోరారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు, కేంద్ర జలసంఘం ప్రతినిధులను గురువారం ఆయన సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో కలిసి విన్నవించారు. పోలవరం బ్యాక్‌వాటర్‌తో జరిగే నష్టాన్ని వివరించారు. బాధితులకు న్యాయం చేశాకే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేయాలన్నారు. ఏటా గోదావరి వరదలకు బూర్గంపాడు, అశ్వాపురం, భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో వేల ఎకరాల్లో వ్యవసాయ భూములు, వందల సంఖ్యలో ఇళ్లు ముంపునకు గురవుతున్నాయన్నారు. స్థానిక రైతులు, ముంపు బాధితుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. సర్పంచ్‌లు మందా నాగరాజు, కిషోర్‌నాయక్, నాయకులు పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, యారం పిచ్చిరెడ్డి తదితరులు ఉన్నారు.


