పాల్వంచరూరల్: మండలంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్) రాష్ట్రస్థాయి ఉత్తమ పర్యావరణ (ఎన్విరాన్‌మెంట్ పెర్ఫార్మెన్స్ అవార్డు–2026) అవార్డుకు ఎంపికై ంది. కళాశాల ప్రాంగణంలో విరివిగా మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. ప్లాస్టిక్ నివారణకోసం ప్రత్యేకంగా విద్యార్థులతో క్లాత్, జూట్ సంచుల తయారీ, విత్తన బంతుల తయారీ, వేస్ట్ నుంచి బెస్ట్ వస్తువుల తయారీ, ఎకో బ్రిక్స్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారి ప్రతిపాదనల మేరకు రాష్ట్రస్థాయి అవార్డు దక్కిందని కళాశాల ప్రిన్సిపాల్ పి.పద్మ తెలిపారు. నేడు హైదరాబాద్‌లో జరిగే ఎన్విరాన్‌మెంట్ డే ప్రోగ్రాంలో అటవీశాఖ మంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు.


