వాతావరణ ం | - | Sakshi
Sakshi News home page

వాతావరణ ం

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

గరిష్టం / కనిష్టం

390 / 260

జిల్లాలో గురువారం పగటి వేళ అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. సాయంత్రం అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది.
ప్రకృతి వైపరీత్యాలను సమర్థంగా ఎదుర్కోవాలి

ఎస్పీ రోహిత్‌రాజు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): రాబోయే వర్షాకాలంలో జిల్లాలో వరదలు, ప్రకృతి వైరీత్యాను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, డీడీఆర్‌ఎఫ్‌, సింగరేణి రెస్క్యూ టీం, అగ్నిమాపక శాఖలతో బుధవారం నిర్వహించిన కోఆర్డినేషన్‌ సమావేశంలో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపునకు గురయ్యే గ్రామాలను ముందుగానే గుర్తించి అక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. బోట్లు, లైఫ్‌ జాకెట్లు, రోప్స్‌, చెట్లను తొలగించడానికి అవసరమైన కట్టర్లు, ఇతర రక్షణ సామగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ క్రాంతి కుమార్‌, టీజీఎస్పీ అసిస్టెంట్‌ కమాండెంట్‌ మరియదాస్‌, ఆపరేషన్‌ ఆర్‌ఐ బి.రవి, సింగరేణి రెస్క్యూ టీం ఇన్‌చార్జ్‌ అనంత రాములు, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు సుమంత్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

ఉత్సాహంగా

సైక్లింగ్‌ పోటీలు

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న సైక్లింగ్‌ వేసవి శిక్షణా శిబిరంలో బుధవారం ప్రపంచ సైక్లింగ్‌ దినోత్సవం సందర్భంగా సైక్లింగ్‌ పోటీలను నిర్వహించారు. విజేతలకు జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామరెడ్డి చేతుల మీదుగా మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్‌ నాగేశ్వరరావు, రైఫిల్‌ షూటింగ్‌ కోచ్‌ నబీ, ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement