ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కావాలి

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

భద్రాచలంటౌన్‌: గోదావరి వరదల గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ సూచించారు. బుధవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన డివిజనల్‌ స్థాయి అత్యవసర సమావేశంలో మాట్లాడారు. ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి పునరావాస కేంద్రాలు, రక్షణ బృందాలు, బోట్లు, లైఫ్‌ జాకెట్లు, అత్యవసర సామగ్రి సిద్ధంగా ఉంచాలన్నారు. వరదల సమయంలో ప్రజల ప్రాణ, ఆస్తి, పశుసంపద నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. లంక గ్రామాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పించాలని చెప్పారు. భద్రాచలం డీఎస్పీ అరుణ్‌ కుమార్‌, ఎస్‌డీసీ ఆనంద్‌ కుమార్‌, డీఎల్‌పీఓ సుధీర్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌, ఏఓ భగవాన్‌ రెడ్డి, డివిజన్‌ పరిధిలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ

Advertisement
 
Advertisement
Advertisement