9.5 కిలోల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

9.5 కిలోల గంజాయి స్వాధీనం

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

భద్రాచలంటౌన్‌: భద్రాచలం మీదుగా ఏపీ సరిహద్దు నుంచి తరలిస్తున్న గంజాయిని ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ శ్రీహరిరావు కథనం ప్రకారం.. సీలేరు నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయి తరలిస్తున్నవారు కూనవరం రహదారిపై పోలీసులకు చిక్కారు. ఒక బైక్‌పై తరలిస్తున్న 4.3 కిలోలు, మరోబైక్‌పై తరలిస్తున్న 5.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బానోత్‌ వీరేందర్‌, గుత్తికొండ యశ్వంత్‌, షేక్‌ ఖాసీం, షేక్‌ అమీర్‌ను అరెస్టు చేసి, బైక్‌లు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.6.20 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు ఖలీల్‌ అహ్మద్‌, జమాల్‌ షరీఫ్‌, కానిస్టేబుళ్లు శివకుమార్‌, నాగరాజు, ప్రసన్నకుమార్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

నలుగురు వ్యక్తుల అరెస్ట్‌

Advertisement
 
Advertisement
Advertisement