ముంపు ముప్పు ఏమేరకు..? | - | Sakshi
Sakshi News home page

ముంపు ముప్పు ఏమేరకు..?

Jun 4 2026 4:52 AM | Updated on Jun 4 2026 4:52 AM

బూర్గంపాడు/భద్రాచలంటౌన్‌: పోలవరం ప్రాజెక్ట్‌ ని ర్మాణంతో గోదావరి వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ (పీపీఏ) అధికా రులు, కేంద్ర జల సంఘంఅధికారులు బుధవా రం పరిశీలించారు. గోదావరి వరదలతో ముందుగా ముంపునకు గురయ్యే ప్రాంతాలను పరిశీలించారు. బూర్గంపాడులోని కొల్లుచెరువు ప్రాంతం, నాగినేనిప్రో లు – సారపాక మధ్యన పెదవాగు, మోతె వద్ద వెదుర్లవాగు ప్రాంతాలను పరిశీలించారు. ఇరిగేషన్‌ అధికారులు ముందుగా సర్వే చేసి, మ్యాప్‌లు రూపొందించి, మా ర్కింగ్‌ చేసిన ప్రాంతాల్లో పర్యటించారు. బూర్గంపాడు మండలంలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములు, రాష్ట్రీయ, జాతీయ రహదారులు, గ్రామాల వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఏమేరకు నష్టం సంభవిస్తుందో నమోదు చేసుకున్నారు. స్థానికులతో మా ట్లాడి వరద వివరాలు ఆరాతీశారు. అనంతరం ఐటీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నా రు. పరిశీలన బృందంలో పీపీఏ చీఫ్‌ ఇంజనీర్‌ సంజీవ్‌వోహ్ర, సెక్రటరీ రఘురామ్‌, చీఫ్‌ ఇంజనీర్‌ (పీఅండ్‌డీ) రమేశ్‌కుమార్‌, పీపీఏ డైరెక్టర్‌ (ఏఅండ్‌సీ) సతీశ్‌కుమార్‌, డిప్యూటీ డైరెక్టర్‌ ఆనెపు ప్రవీణ్‌, ఇరిగేషన్‌ సీఈ శ్రీనివాసరెడ్డి, ఈఈలు వెంకటేశ్వరరావు, సయ్య ద్‌ అహ్మద్‌జానీ, డీఈఈ కె.శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అలాగే, పీపీఏ బృందం భద్రా చలం కరకట్ట, స్లూయిస్‌లను పరిశీలించారు. స్లూయిస్‌ల పనితీరుపై ఆరాతీశారు. శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయానికి సం బంధించిన మ్యాప్‌ను పరిశీలించి ముంపునకు గుర య్యే ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. 2022లో గోదావరి వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన సుభాష్‌నగర్‌కాలనీలో పర్యటించారు. దుమ్ముగూడెం మండలంలోని తూరుబాక వాగు ప్రాంతాన్ని పరిశీలించారు.

పోలవరం ప్రాజెక్ట్‌తో ముంపునకు

గురయ్యే ప్రాంతాల్లో అధికారుల పర్యటన

Advertisement
 
Advertisement
Advertisement