పాల్వంచరూరల్: వర్షపు నీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అందుకోసం ఇంకుడు గుంతలు, ఫారంపాండ్స్‌ను నిర్మించాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ణి బి.నాగలక్ష్మి అన్నారు. మండలంలోని బస్వతారకకాలనీలో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం స్వచ్ఛగ్రామం, సురక్షిత జలవాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటారు. వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలను త్వరతగతిన పూర్తిచేయాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నియంత్రించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ జర్పుల కాశ మ్మ, ఉపసర్పంచ్ భాగ్యమ్మ, ఎంపీఓ చెన్నకేశవులు, ఏపీఎం షబానా, కార్యదర్శులు రాంబాబు, కృష్ణవేణి పాల్గొన్నారు.
నేటి నుంచి గ్రామసభలు
ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నుంచి 10వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ బొగ్గనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘నవ లిమిటెడ్’కు అవార్డు
పాల్వంచ: పాల్వంచకు చెందిన నవ లిమిటెడ్‌కు ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ ఇన్ సీఎస్‌ఆర్–2026 అవార్డ్‌ను దక్కించుకుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్, యూనిట్ హెడ్ ఎల్వీ శరత్‌బాబు బుధవారం ప్రకటనలో తెలిపారు. 9వ తేదీన హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డ్ అందుకోనున్నట్లు పేర్కొన్నారు.
చెట్టును ఢీకొన్న బైక్
ఇల్లెందురూరల్: మండలంలోని వీరాపురం గ్రామంలో మూలమలుపు వద్ద బుధవారం రాత్రి బైక్ అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలయాయి. మహబూబాబాద్ జిల్లా పాఖాల నుంచి స్వగ్రామమైన రేపల్లెవాడకు బైక్‌పై వస్తున్న కల్తీ స్వామి, విజయలక్ష్మి దంపతులు వస్తున్నారు. వీరాపురంలో మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొంది. విజయలక్ష్మి తలకు తీవ్ర గాయం కాగా, స్వామికి సైతం గాయాలయ్యాయి. ఇద్దరినీ 108 ద్వారా ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు.


