ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్
భద్రాచలం: పోరాటాలు, అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో గిరిజనుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ఐటీడీఏల ద్వారా పాటుపడుతోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ఆవరణలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు కొనసాగిస్తున్న గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. విద్యా, వైద్యం ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు సాగునీరు, తాగునీరు, స్వయం ఉపాధి రంగాల్లో అభివృద్ధికి అధికారులు, సిబ్బంది కృషి చేస్తున్నారని చెప్పారు. గిరిజన మ్యూజియం, గిరిజన మార్ట్‌ల ద్వారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, వివిధ విభాగాల అధికారులు ఉదయ్‌కుమార్, గన్యా, వేణు, అశోక్, సైదులు, ఆనంద్‌కుమార్, వెంకటపుల్లయ్య, సున్నం రాంబాబు, మణిధర్, రమేశ్, అలివేలు మంగతాయారు, హరికష్ణ, రాజకుమారి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


