సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ రోహిత్‌రాజ్ తెలిపారు. తెలంగాణ అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ఎస్పీ కార్యాలయ ఆవరణలో మంగళవారం జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ ఎందరో త్యాగాలు, పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని తెలిపారు. ఈ మేరకు శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పాటుపడుతూ, సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. అనంతరం రాష్ట్రప్రభుత్వ పతకాలకు ఎంపికై న చర్ల సీఐ రాజువర్మ, ఆర్‌ఐ బి.రవిని ఎస్పీ అభినందించారు. డీఎస్పీలు ఆదినారాయణ, మల్లేశ్‌స్వామి, సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మంజ్యా, సీఐలు, ఎస్‌ఐలు, ఎస్పీ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజ్


