డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన వాసంతి
కొత్తగూడెం అర్బన్: జిల్లాలో విద్యాప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేస్తానని జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి తెలిపారు. డీఈఓగా నియమితులైన ఆమె కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) శంభుప్రసాద్, ఉద్యోగులు స్వాగతం పలికారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రవేశాల పెంపు, అభివృద్ధికి కృషి చేయడమే కాక ఉత్తమ ఫలితాలు నమోదయ్యేలా పాటుపడతానని తెలిపారు. అనంతరం డీఈఓ వాసంతి కలెక్టర్ అంకిత్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.


