జయహో తెలంగాణ | - | Sakshi
Sakshi News home page

జయహో తెలంగాణ

Jun 3 2026 12:21 AM | Updated on Jun 3 2026 12:21 AM

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలు, రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ సాధన పోరాటంలో మృతి చెందిన అమరవీరులకు నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల పునాదులపైనే నేటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. అమరుల ఆశయాలు సాధించేందుకు ఐక్యంగా ఉద్యమించాలని, ప్రజా సంక్షేమం, హక్కుల రక్షణ కోసం కృషి చేయాలన్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

ఘనంగా రాష్ట్రావతరణ దివోత్సవం ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఎగిరిన జాతీయ జెండా

Advertisement
 
Advertisement
Advertisement