అడ్వకేట్ల రక్షణకు చట్టం అమలు | - | Sakshi
Sakshi News home page

అడ్వకేట్ల రక్షణకు చట్టం అమలు

Jun 3 2026 12:21 AM | Updated on Jun 3 2026 12:21 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. న్యాయవాదుల గౌరవం, స్వాతంత్య్రం, భద్రతలను పరిరక్షించేందుకు ఈ చట్టం మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ చట్ట సాధన కోసం తెలంగాణ రాష్ట్ర న్యాయవాద సమాజం ఎన్నో సంవత్సరాలుగా ఐక్యంగా పోరాడిందన్నారు.

ఈ సందర్భంగా న్యాయవాదుల దీర్ఘకాలిక డిమాండ్‌ను సానుకూలంగా పరిగణించి ఈ చారిత్రాత్మక చట్టం అమలుకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి ఫెడరేషన్‌ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ చట్ట రూపకల్పన, ఆమోద ప్రక్రియలో కృషి చేసిన ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో బిల్లును ఆమోదింపజేయడంలో చురుకై న పాత్ర పోషించిన దేవరకద్ర శాసనసభ్యుడు, న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ సమర్థవంతంగా అమలవుతూ, న్యాయవాదుల హక్కులు, గౌరవం, భద్రతలను మరింత బలోపేతం చేస్తుందని ఫెడరేషన్‌ ఆశాభావం వ్యక్తం చేస్తోందన్నారు.

న్యాయవాదుల హర్షం

అడ్వకేట్‌ ప్రొటెక్ట్‌ యాక్ట్‌ మంగళవారం నుంచి అమలులోకి వచ్చిన సందర్భంగా కొత్తగూడెం కోర్టులో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసుకుని ఆనందం పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జీవీకే మనోహర్‌, పప్పుల ప్రసాద్‌, వేల్పుల సుధాకర్‌, గడదాసు నాగరాజు, జి.రామ్మూర్తి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement