భూసేకరణకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

భూసేకరణకు సహకరించాలి

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● సీతారామ డిస్ట్రిబ్యూటరీ కాలువలు, మారెళ్లపాడు లిఫ్ట్‌పై సమీక్ష

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా కార్యాలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్‌ కాంతులతో వెలుగులీనుతున్నాయి. మంగళవారం జెండా ఆవిష్కరణలతోపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. –సూపర్‌బజార్‌ (కొత్తగూడెం)
● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ● సీతారామ డిస్ట్రిబ్యూటరీ కాలువలు, మారెళ్లపాడు లిఫ్ట్‌పై సమీక్ష

అశ్వాపురం: సీతారామ ప్రాజెక్ట్‌ డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియకు ప్రజాప్రతినిధులు, రైతులు సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తే వచ్చే ఏడాది నాటికి పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందన్నారు. మండల పరిధిలోని బీజీ కొత్తూరు గ్రామంలో సీతారామ ప్రాజెక్ట్‌ ఫేజ్‌–1 పంప్‌హౌస్‌ సమీపంలో నిర్మిస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను సోమవారం ఆయన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్‌ అంకిత్‌, సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌శ్రేష్ఠలతో కలిసి పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. బీజీ కొత్తూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారెళ్లపాడు లిఫ్ట్‌ పనులు జూలై లోపు పూర్తి చేయాలని అన్నారు. సీతమ్మసాగర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రానున్న వర్షాకాలంలో నీటి విడుదలకు ముందే సీతారామ కాలువలను సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. పంప్‌హౌస్‌ నిర్మాణానికి సహకరించిన బీజీ కొత్తూరు గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో రహదారి, మౌలిక సదుపాయాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, తుమ్మలచెరువును అభివృద్ధి చేయాలని మొండికుంట సర్పంచ్‌ మర్రి సంధ్య, మాజీ సర్పంచ్‌ మర్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి వినతిపత్రం అందజేయగా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.నీటిపారుదల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఈ నర్సింహారావు, ఈఈ వెంకటేశ్వరరావు, డీఈ శ్రీనివాసరెడ్డి, మేఘా సంస్థ ఏవీపీ శ్రీనాథ్‌రెడ్డి, ఇతర అధికారులు సూర్యప్రకాష్‌, ముత్యాలరావు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి భిక్షమయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement