అధికారులు సమన్వయంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరి ష్కారానికి అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యాచందన, డీఆర్‌ఓ పద్మావతిలతో కలిసి ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ వినతిపత్రాన్ని బాధ్యతాయుతంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఉపాధి అవకాశాలు కల్పించా లని, గృహలక్ష్మి పథకంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థికసాయం చేయాలని, కోతుల బెడద నివారించాలని పలువురు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించారు. పరిశీలించిన కలెక్టర్‌ దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు. సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలువురు అధికారులను ప్రశ్నించారు. అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో

ప్రజల భాగస్వామ్యం పెంచాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచాలని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా స్థాయి పర్యావరణ పరిరక్షణ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ అంకిత్‌, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణాగౌడ్‌, అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్‌, విద్యా చందన, డీఆర్‌ఓ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతీ వ్యక్తి బాధ్యతగా ముందుకు రావాలని అన్నా రు. ఈనెల 12వరకు జిల్లావ్యాప్తంగా ప్రజల్లో పర్యా వరణ చైతన్యం పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మొక్కలు నాటి, సంరక్షించాలన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణాగౌడ్‌ మాట్లాడుతూ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 55లక్షల మొక్కల నాటనున్న ట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. అటవీశాఖ సిబ్బందికి సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. సమావేశంలో వివిధ శాఖ ల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజావాణిలో కలెక్టర్‌ అంకిత్‌

Advertisement
 
Advertisement
Advertisement