సూపర్‌బజార్(కొత్తగూడెం)/చర్ల: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో సోమవారం ప్రకటించిన వివిధ పతకాలకు జిల్లా ఉంచి పలువురు అధికారులు ఎంపికయ్యారు. ఇద్దరికి శౌర్య పతకాలు, ఆరుగురికి కఠిన సేవా పతకాలు, 10 మందికి సేవాపతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఓఎస్‌డీ కార్యాలయ ఆర్‌ఐ ఆఫ్ పోలీస్ బి.రవి, చర్ల సీఐ ఏ రాజువర్మలకు శౌర్య పతకాలు వరించాయి. కఠిన సేవాపతకాలకు చర్ల ఎస్‌ఐ పడాల కేశవరావు, హెడ్ కానిస్టేబుల్ ఎల్.రాంబాబు, కానిస్టేబుళ్లు పెట్టి రాము, పూజారి వినోద్‌కుమార్, దుమ్ముగూడెం కానిస్టేబుల్ పి.రాము, ఏఆర్‌పీసీ బి.శ్రీనివాసరావు ఎంపికయ్యారు. సేవాపతకాలు ఎస్‌ఐ డి.బాలస్వామి నాథన్, ఏఎస్‌ఐ జి.యోహాన్, ఏఆర్ ఎస్‌ఐ పి.యుగంధర్, లక్ష్మీదేవిపల్లి హెడ్ కానిస్టేబుల్ ఆర్.వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ ఎం.శంకరయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ భూక్య లక్‌పతి, హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ ఆర్ రామచంద్రారెడ్డి, సుజాతనగర్ హెడ్ కానిస్టేబుల్ వి.భీముడు, చాతకొండ 6వ బెటాలియన్ ఆర్‌ఐ ఆఫ్ పోలీస్ చింతా వెంకట శ్రీనివాసరెడ్డిలను వరించాయి. విధి నిర్వహణలో , ఏజెన్సీలో మావోయిస్టు కార్యకలాపాల అరికట్టేందుకు విశేష కృషి చేసిన అధికారులు, సిబ్బందిని పతకాలకు ఎంపిక చేశారు. వీరికి మంగళవారం పతకాలు ప్రదానం చేయనున్నారు. కాగా పతకాలకు ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఇద్దరు శౌర్య, ఆరుగురు కఠిన సేవా, 10 మంది సేవా పతకాలకు ఎంపిక


