రామవరం ఆస్పత్రిని పునరుద్ధరించండి | - | Sakshi
Sakshi News home page

రామవరం ఆస్పత్రిని పునరుద్ధరించండి

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

రుద్రంపూర్‌/కొత్తగూడెంఅర్బన్‌: కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవరంలో వందలాది కార్మికులు, కార్మిక కుటుంబాలు నివాసముంటున్న నేపథ్యంలో రామవరం ఆస్పత్రిని పునరుద్ధరించాలని ఏఐటీయూసీ నాయకులు ఆస్పత్రి చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కిరణ్‌రాజ్‌కుమార్‌ను కోరారు. సోమవారం ఆస్పత్రి సీఎంఓకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కేంద్ర కమిటీ కార్యదర్శి వంగా వెంకట్‌ మాట్లాడారు. ఆస్పత్రిని మూసివేసే ఆలోచనను విరమించుకోవాలని, వైద్యుడితోపాటు నర్సును కూడా ఏర్పాటు చేయాలని కోరారు. స్థానికులు ఏ చిన్న చికిత్స కోసమైనా ప్రధానాస్పత్రిని ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో రమణమూర్తి, గట్టయ్య, రాము, కత్తెర రాములు, అనంతలక్ష్మి, మధుకృష్ణ, నాగయ్య, రమేశ్‌, మర్రి గోపి, లక్ష్మీనారాయణ, రాజేశ్వరరావు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement