జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌(టీయూడబ్ల్యూజే – ఐజేయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్‌ అంకిత్‌, జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్‌కు వినతిపత్రాలు అందజేశారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం, ఇందిర మ్మ ఇండ్లు మంజూరు చేయాలని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్‌ విద్యాసంస్థలలో 50 శాతం ఫీజు రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్యపరీక్షల్లో రాయితీ ఇవ్వాలని, రైల్వే పాస్‌లను పురుద్ధరించాలని వినతిపత్రాలు అందజేశారు. డీఎంహెచ్‌ఓ, డీఈఓలకు సైతం వినతిపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కౌన్సిల్‌ సభ్యుడు బీవీ రమణారెడ్డి, యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు జాగు వెంకటరత్నం, కార్యదర్శి జునుమాల రమేశ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా కార్యదర్శి నాగచంద్ర పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement