హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీ | - | Sakshi
Sakshi News home page

హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీ

Jun 2 2026 3:12 AM | Updated on Jun 2 2026 3:12 AM

పాల్వంచ: పట్టణంలో పలు హోటళ్లు, రెస్టారెంట్లను సోమవారం జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ ఇ.శరత్‌ తనిఖీ చేశారు. పలు హోటళ్లలో శుభ్రత, నాణ్యత లేకుండా ఆహార పదార్థాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న అంశంపై శ్రీఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ జాడెక్కడ?శ్రీ అనే కథనం సాక్షిలో ప్రచురించితమైంది. దీంతో ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ బీసీఎంరోడ్‌లోని మెస్‌లు, రెస్టారెంట్‌లను తనిఖీ చేసి, తినుబండారాలు, సరుకులను పరిశీలించారు. పలు శాంపిళ్లను సేకరించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి ఫిర్యాదు ఉన్నా 83670 56146 నంబర్‌లో సంప్రదించాలని, ఆరు నెలల కాలంలో 43 కేసులు నమోదు చేసి, రూ.1.5 లక్షలు జరిమానా విధించామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement