జూలూరుపాడు: రాష్ట్ర సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్‌నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన లక్ష ఇందిరమ్మ ఇండ్ల సామూహిక గృహ ప్రవేశ కార్యక్రమంలో భాగంగా సోమవారం వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్‌నాయక్ మండలంలోని పడమటనర్సాపురం, జూలూరుపాడు, వెంగన్నపాలెం, భోజ్యాతండా గ్రామ పంచాయతీ రాజారావుపేట, పుల్లుడుతండా తదితర గ్రామాల్లో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చడం కోసం కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేయగా, రెండో విడతలో 2.50 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ టి.శ్రీనివాస్, ఎంపీడీఓ తాళ్లూరి రవి, ఎంపీఓ తులసిరామ్, హౌసింగ్ ఏఈ గాడ్విన్‌తోపాటు లేళ్ల వెంకటరెడ్డి, మాళోత్ మంగీలాల్‌నాయక్, అల్లాడి నరసింహారావు, సంఘం లక్ష్మీకుమారి, లావుడ్యా ద్వాలీ, బానోత్ సుమలత, ఆళ్ల ప్రవీణ్‌కుమార్, దుద్దుకూరి మధుసూదన్‌రావు, లేళ్ల గోపాల్‌రెడ్డి, దుద్దుకూరి సుమంత్, లేళ్ల అప్పిరెడ్డి, లకావత్ లచ్చునాయక్, చౌడం నరసింహారావు, బాదావత్ హరీశ్, బి.బాబు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు
టేకులపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాల్లో భాగంగా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య టేకులపల్లి మండలంలో సోమవారం పర్యటించారు. మండలంలోని టేకులపల్లి, గోల్యతండా, తొమ్మిదోమైలుతండా, బేతంపూడి, రోళ్లపాడు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఆయన ప్రారంభించారు. గృహప్రవేశం చేసిన దంపతులను సత్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లక్కినేని శ్యామ్, కోరం సురేందర్, బోడ మంగీలాల్, కాలే ప్రసాద్, హౌసింగ్ ఏఈ గణేశ్, ముచ్చా సుధాకర్, సర్పంచులు బానోత్ పూర్ణ, సుభాష్‌చంద్రబోస్, నాకా, చందర్‌సింగ్, బాలు, ఊకె సునీత తదితరులు పాల్గొన్నారు.


