పాల్వంచ: వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరవక ముందే పాఠ్య పుస్తకాలను పాఠశాలలకు అందిస్తామని ఎంఈఓ శ్రీరామ్మూర్తి అన్నారు. సోమవారం స్థానిక ఎంఆర్‌సీ కార్యాలయంలో మండలంలోని 75 మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కేజీబీవి పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాశాఖ ఈ సంవత్సరం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు యూడీఐఎస్‌ఈ ప్రకారం పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను ముందుగానే సిద్ధం చేసి పంపించిందన్నారు. జూన్ 12 తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం రోజునే విద్యార్థులకు వీటిని అందిస్తామని తెలిపారు.
ఎఫ్‌ఆర్‌ఓగా తేజస్వి
జూలూరుపాడు: జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా కె.తేజస్వి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఏడూళ్లబయ్యారం ఎఫ్‌ఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న తేజస్వి సాధారణ బదిలీల్లో భాగంగా జూలూరుపాడు వచ్చారు. జూలూరుపాడు ఎఫ్‌ఆర్‌ఓగా విధులు నిర్వర్తిస్తున్న జి.ప్రసాద్‌రావు బదిలీపై మహబూబాబాద్ జిల్లా గూడూరుకు వెళ్లారు. పాపకొల్లు అటవీ సెక్షన్ ఆఫీసర్‌గా జి.తారాసింగ్, రాజుపాలెం ఎఫ్‌బీఓగా పెరుమాళ్ల ఖాసీం, రాజారావుపేట ఎఫ్‌బీఓగా బి.జోగేశ్, పాపకొల్లు ఎఫ్‌బీఓగా నాగేశ్, వినోభానగర్ ఎఫ్‌బీఓగా బి.బాలాజీ బాధ్యతలు స్వీకరించారు.


