సుజాతనగర్: హై ఓల్టోజ్ విద్యుత్ సరఫరాతో సుమారు 20 లక్షల విద్యుత్ పరికరాలు దగ్ధం అయిన ఘటన సుజాతనగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో స్థానిక ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంలో హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా అయింది. దీంతో సుమారు 60 గృహాల్లోని ఏసీలు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, టీవీలు తదితర వస్తువులు దగ్ధమయ్యాయి. ఆగ్రహించిన బాధితులు స్థాఽనిక విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే హై ఓల్టోజ్ విద్యుత్ సరఫరా అయిందని, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నష్టం వాటిల్లిన గృహాలను పరిశీలించి నష్టాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏఈ కిషన్ తెలిపారు.
సమస్యలు పరిష్కరిస్తాం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ముస్లింలకు సంబంధించిన బీసీ–ఈ, ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌పాషా బీసీ కమిషన్‌ను కోరారు. సోమవారం బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌ను కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాప్రోలు జైప్రకాష్, తిరుమలగిరి సురేందర్, మైనారిటీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ వాహబ్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


