పాల్వంచరూరల్: జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కిన్నెరసానిలోని గిరిజన గురుకుల ప్రతిభ జూనియర్ కళాశాల (సీఓఈ)కు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించారు. డి.సిద్ధు 475 ర్యాంక్, జి.రోహిత్ 1,380 ర్యాంక్ సాధించారని ప్రిన్సిపాల్ రమేశ్ సోమవారం తెలిపారు. కళాశాల నుంచి మొత్తం ఏడుగురు విద్యార్థులు పరీక్ష రాయగా ఇద్దరు విద్యార్థులు ఐఐటీల్లో సీట్లు సాధించారని పేర్కొన్నారు. విద్యార్థులను ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్ర కార్యదర్శి, రీజినల్ కోఆర్డినేటర్ అరుణకుమారి అభినందించారు.
టేకులపల్లి: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టేకులపల్లి మండలం బద్ధుతుండ పంచాయతీ సామ్యతండాకు చెందిన బానోతు యుగంధర్ ఎస్టీ విభాగంలో 622వ ర్యాంకు సాధించాడు. బొమ్మనపల్లికి చెందిన లకావత్ జాహ్నవి ఎస్టీ విభాగంలో 1,163వ ర్యాంకు సాధించింది.


