వైభవంగా చండీహోమం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా చండీహోమం

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

పాల్వంచరూరల్‌: పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి)ఆలయంలో ఆదివా రం చండీహోమం, విశేష పూజలు నిర్వహించారు. తొలుత మేళతాళాలు, వేదమంత్రాలతో స్వామివారిని అర్చకులు ఊరేగింపుగా తీసుకొచ్చా రు. అనంతరం మండపారాధన, గణపతిపూజ చండీహోమం చేశారు. చివరన పుర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజలో పాల్గొన్న 28 మంది భక్త దంపతులకు అర్చకులు అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలను అందజేశారు. ఈఓ రజనీకుమారి పాల్గొన్నారు.

నేడు ‘సీతారామ’ను

సందర్శించనున్న మంత్రి తుమ్మల

అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరులో ఉన్న సీతారామ ప్రాజెక్టు ఫేస్‌–1 పంప్‌ హౌస్‌ను సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించనున్నారు. పినపాకలో ప్రైవేట్‌ కార్యక్రమానికి హాజరైన అనంతరం పంప్‌ హౌస్‌ సందర్శన, మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను మంత్రి పరిశీలించనున్నారు.

నేడు ప్రజావాణి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ప్రజలు తమ సమస్యలపై లిఖిత పూర్వక అర్జీలు అందజేయాలని సూచించారు. భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో కూడా ప్రజావాణి నిర్వహించనున్నటుకలెక్టర్‌ తెలిపారు.

4న పాటల పోటీలు

భద్రాచలంఅర్బన్‌: గాన గంధర్వులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా ఈ నెల 4న రెండు తెలుగు రాష్ట్రాల గాయనీ గాయకులకు పాటల పోటీలు నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి స్వరాంజలి నిర్వాహకుడు పోకల శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాటల పోటీలు జరుగుతాయని, విజేతలకు క్యాష్‌ప్రైజ్‌తోపాటు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.

జలనవరుల శాఖలో 40, జీసీసీలో 11 మంది బదిలీ

పాల్వంచరూరల్‌: ప్రభుత్వశాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. జలనరులశాఖలో 40 మంది ఇంజనీర్లు బదిలీ అయ్యారు. కొత్తగూడెం ఈఈ అర్జున్‌తోపాటు 8మంది డీఈలు, 30మంది ఏఈలు, ఇద్దరు ఏఈఈలకు స్థానచలనం కలిగింది. గిరిజన సహకార సంస్థ(జీసీసీ)లో 11 మంది సేల్స్‌మెన్లను బదిలీ చేశారు. పాల్వంచ బ్రాంచ్‌ పరిధిలో ఖాళీగా ఉన్న యానంబైల్‌ డీఆర్‌ డిపోకు సేల్స్‌మెన్‌ జె.వెంకటేశ్వర్లు, నాగారం కాలనీ డిపోకు దమ్మపేట నుంచి బి.బాలు, ఇరవెండికి భద్రాచలం నుంచి ఏ.వెంకటరత్నం, పూసుగూడెం డిపోకు ఇల్లెందు నుంచి తావుర్యా బదిలీపై వచ్చారు.

గురుకుల టాపర్‌కు సన్మానం

ఇల్లెందురూరల్‌: గురుకుల కళాశాలల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను శనివారం హైదరాబాద్‌లో సన్మానించారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ఉన్నతాధికారులు హాజరై ప్రశంసాపత్రం, నగదు ప్రోత్సాహకం అందజేశారు. మండలంలోని లక్ష్మీనారాయణతండాకు చెందిన శివజ్యోతిక కూడా సన్మానం పొందింది. సుదిమళ్ల గురుకుల కళాశాలలో ఇంటర్‌ సీఈసీ చదివిన ఆమె 970/1000 మార్కులు సాధించి గురుకులాల్లో రాష్ట్రస్థాయి ప్రథమ స్థానంలో నిలిచింది. శివజ్యోతికను తల్లిదండ్రులు బోడ శంకర్‌, విజయ, గ్రామస్తులు అభినందించారు.

రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

ఖమ్మం సహకారనగర్‌: డీఈఈ సెట్‌లో అర్హత సాధించిన ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు ఈ నెల 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఖమ్మం టేకులపల్లిలోని డైట్‌ కళాశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement