పాల్వంచ: పాల్వంచకు చెందిన చరిత ఆర్గానిక్ కల్టివేషన్ అండ్ సోలార్ డ్రయర్స్ నిర్వాహకులు డాక్టర్ ఎస్.సోమరాజు దొర బెస్ట్ ట్రైబల్ అచీవర్ అవార్డు–2026 అందుకున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన జన జాతీయ గరిమా ఉత్సవ్–2026 కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం సోమరాజు దొర మాట్లాడుతూ సంస్థ స్థాపించిన 18 నెలల కాలంలోనే రాష్ట్ర స్థాయి గౌరవాన్ని దక్కించుకుందన్నారు. ఆర్గానిక్, నేచురల్ ఉత్పత్తుల సేకరణ, తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం వల్లే అవార్డు లభించిందని తెలిపారు.


