ఈత.. కేరింత | - | Sakshi
Sakshi News home page

ఈత.. కేరింత

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

తల్లిదండ్రుల పర్యవేక్షణలో..

స్విమ్మింగ్‌పై పిల్లల ఆసక్తి

ఎండ నుంచి ఉపశమనం, వ్యాయామం

రోజూ వస్తున్నా..

నీళ్లంటే భయం పోయింది

సత్తుపల్లిటౌన్‌: వేసవి సెలవుల్లో చిన్నారులు ఈత నేర్చుకోవడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఈత నేర్పిస్తుండడంతో సత్తుపల్లిలో స్విమ్మింగ్‌పూల్‌ నిత్యం ఉదయం, సాయంత్రం సందడిగా ఉంటోంది. ఈతతో ఆరోగ్యానికి మేలు జరుగుతుండడంతో పిల్లలకు స్విమ్మింట్‌ నేర్పిస్తూ పెద్దలు కూడా ఈత ప్రాక్టీస్‌ చేస్తున్నారు. సత్తుపల్లిలోని డాల్ఫిన్‌ స్విమ్మింగ్‌పూల్‌లో ఐదేళ్ల లోపు చిన్నారులకు కోచ్‌ ఈత నేర్పిస్తున్నారు. ఆ పక్కనే ఏడు అడుగుల లోతుతో మరో పూల్‌లో పెద్దలు ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నారు.

ఉల్లాసం.. వ్యాయామం

వేసవిలో వయస్సుతో సబంధం లేకుండా చిన్నా, పెద్ద ఈత కొట్టేందుకు ప్రాధాన్యత ఇస్తారు. గ్రామాల్లో వ్యవసాయ బావులు, చెరువులు ఉండగా.. పట్టణాల్లో ఆ వెసలుబాటు లేక స్విమ్మింగ్‌ పూల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. రోజూ గంట పాటు ఈత కొడితే శ్వాస ప్రక్రియ మెరుగుపడడంతో పాటు శరీరంలోని క్యాలరీలు కరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాక ఈతతో 90 శాతం అవయవాలు కదలి మంచి వ్యాయామం చేసినట్లు అవుతుందని, మెదడు, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని, మానసిక ఉల్లాసం లభిస్తుందని సూచిస్తున్నారు. ఇవేకాకుండా ఈత కొట్టడం వల్ల ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది. ఒత్తిడి దూరవమవడమే కాక జ్ఞాపకశక్తి, చురుకుదనం పెరుగుదలకు దోహదపడుతుందని చెబుతున్నారు.

ఈత నేర్చుకునేటప్పుడు లైఫ్‌ జాకెట్లు, తలకు వాటర్‌ ప్రూఫ్‌ క్యాప్‌, కళ్లకు అద్దాలు, చెవుల్లోకి నీరు వెళ్లకుండా అమర్చే పరికరాలతో పాటు సేఫ్టీ పరికరాలు వినియోగించాలి. శిక్షకుల పర్యవేక్షణ ఉండాలి. తలకు టోపీ, కళ్లకు అద్దాలు ధరించటం మంచిది. చర్మవ్యాధులు, జలుబు ఉన్నవారు స్విమ్మింగ్‌పూల్‌లోకి వెళ్లకూడదు. స్విమ్మింగ్‌లో నుంచి బయటకు రాగానే స్నానం చేస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. స్విమ్మింగ్‌ పూల్‌లో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. వారి వెంట ఉండటం మంచిది.

వేసవి సెలవులు వృథా చేయకుండా, సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేయకుండా ప్రతీరోజు ఈతకు వస్తూ మెళకువలు నేర్చుకుంటున్నా. తద్వారా మంచి ఆరోగ్యం సొంతం అవుతోంది. ఇప్పటికే ఈతలో నైపుణ్యం సాధించి పోటీల్లో బహుమతులు సాధించా. –సుహాస్‌ కార్తికేయ, సత్తుపల్లి

నాకు మొదట్లో నీళ్లంటే భయం ఉండేది. కానీ ఇప్పుడు ఈతలో నైపుణ్యం సాధించడంతో ఆ భయం పోయింది. ఈత ఒక ఉత్తమ వ్యాయామం. దీనివల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంచి ఆరోగ్యం సొంతమవుతుంది. –ప్రణతి, సత్తుపల్లి

Advertisement
 
Advertisement
Advertisement