అంగన్‌వాడీల్లో 1,203 ఖాళీలు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో 1,203 ఖాళీలు

May 31 2026 12:24 AM | Updated on May 31 2026 12:24 AM

టీచర్‌ 192, ఆయా పోస్టులు 1,011

భర్తీ చేస్తామని ఇటీవల

ప్రకటించిన ప్రభుత్వం

మహిళా నిరుద్యోగుల్లో

రేకెత్తుతున్న ఆశలు

నిబంధనల ప్రకారం..

భద్రాచలంఅర్బన్‌: ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24న ప్రకటించింది. జిల్లాలో కూడా అధిక సంఖ్యలో ఖాళీ పోస్టులు ఉండటంతో మహిళా నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం జూన్‌ 1 నుంచి అంగన్‌వాడీ పాఠశాలలు తిరిగి ప్రారంభం కానుండగా, జూన్‌ నెలాఖరు నాటికి నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలో 2,061 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులు 192, ఆయా పోస్టులు 1,011, మొత్తం 1,203 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కొన్నిచోట్ల ఒక్కో టీచర్‌కు రెండు కేంద్రాల బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రీప్రైమరీ స్కూళ్లు ప్రారంభించేందుకు, బ్రేక్‌ ఫాస్ట్‌ అందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగే అవకాశం ఉంది. ఖాళీలు భర్తీ చేస్తేనే మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది.

దుమ్ముగూడెం ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌తోపాటు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులు 1203 ఖాళీలను జిల్లా అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. ఖాళీల భర్తీ ప్రక్రియపై ఇంకా ఆదేశాలు రాలేదు. ఆదేశాలు రాగానే నిబంధనల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తాం.

–ఉండేటి జ్యోతి , దుమ్ముగూడెం సీడీపీఓ

Advertisement
 
Advertisement
Advertisement