● కలెక్టర్ అంకిత్ ● యంగ్ ఇండియా పాఠశాల భవన నిర్మాణ పనులు పరిశీలన
అశ్వారావుపేటరూరల్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని వచ్చే విద్యాసంత్సరం ప్రారంభం నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శనివారం ఆయన అశ్వారావుపేటలో పాఠశాల నిర్మాణ పనులను పరి శీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఐదు చోట్ల పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆ తర్వాత మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. జూన్ 2వ తేదీన గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. భూ భారతి, సాదా బైనామా, భూ సర్వే దరఖాస్తులు, పురోగతి తదితర వివరాలను తహసీల్దార్ దాసరి కిషోర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఽవివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులు రామకోట రెడ్డి, దిలీప్ రెడ్డి, మదన్ కుమార్, వెంకట రత్నం పాల్గొన్నారు.
బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి
బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా వారోత్సవాల సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో బాలికలతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలన్నారు. ఎస్పీ రోహిత్‌రాజు, ఇతర అధికారులు హరికుమారి, విద్యాచందన, బి.నీలేష్, సోయం సుజాత పాల్గొన్నారు.


