భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తది తర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు దంపతులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
7న హైదరాబాద్‌లో రామయ్య కల్యాణం
హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌లో వచ్చే నెల 7న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరపనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్‌రావు శనివారం ప్రకటనలో తెలిపారు.


