● చిన్నారులకు కళలు, సంస్కృతి, సంప్రదాయాల్లో శిక్షణ ● ఇదే శిబిరంలో ప్రాచీన యుద్ధకళలపైనా తర్ఫీదు ● ఆసక్తిగా నేర్చుకుంటున్న పిల్లలు
మొదట్లో భయం వేసింది. కానీ ఇప్పుడు ధనుర్విద్య, యుద్ధ కళలపై చాలా ఆసక్తి పెరిగింది. ఇక్కడి క్రమశిక్షణ నాకు చాలా నచ్చింది. వేసవి సెలవుల్లోనే కాకుండా ఆ తర్వాత కూడా ప్రాక్టీస్ కొనసాగించాలని నిర్ణయించుకున్నా.
–గన్నవరపు సాయిహితశ్రీ,,
ఇంటర్మీడియట్, ఖమ్మం
ప్రాచీన యుద్ధ కళల్లోనూ..
చిన్నారులు ఆసక్తి చూపే సంగీతం, ఇతరత్రా కాకుండా స్వామి వివేకానంద విద్యా పరిషత్ ఆధ్వర్యాన భారతీయ ప్రాచీన యుద్ధ కళలపైనా శిక్షణ ఇస్తుండడం విశేషం. రెసిడెన్షియల్ విధానంలో ఇస్తున్న ఈ శిక్షణకు పలు ప్రాంతాలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం యోగా శిక్షణతో ప్రారంభించి.. ఆ తర్వాత కత్తి సాము, కర్ర సాము, ధనుర్విద్య, గన్ ఫైరింగ్ తదితర కళల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్‌కు చెందిన కోచ్ దేవేందర్‌సింగ్ విద్యార్థులకు నేర్పిస్తున్నారు. విద్యార్థుల్లో ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, దేశభక్తి పెంపొందించే లక్ష్యంగా ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.


