బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం | - | Sakshi
Sakshi News home page

బాసర ట్రిపుల్‌ఐటీలో ప్రవేశం

May 31 2026 12:18 AM | Updated on May 31 2026 12:18 AM

దమ్మపేట: మండలంలోని నాగుపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇటీవల పదో తరగతి పూర్తి చేసుకున్న మేక మన్విత (571 మార్కులు), చాపా నాగదినేశ్‌ (551 మార్కులు) బాసర ఐఐఐటీ (ట్రిపుల్‌ ఐటీ)లో ప్రవేశం పొందినట్లు హెచ్‌ఎం బజ్జూరి సరళ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలువురు అభినందించారు.

డీజీపీని కలిసిన

కూనంనేని

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్ర డీజీపీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీ.వీ.ఆనంద్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు శనివారం హైదరాబాద్‌లో కలిశారు. ఈ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, తదితర అంశాలపై చర్చించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర సమితి సభ్యుడు ఎస్‌కే జానీమియా తదితరులు ఆయన వెంట ఉన్నారు.

రిటైర్డ్‌ పోలీస్‌

అధికారులకు సత్కారం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): పోలీస్‌ శాఖలో విధులు నిర్వరిస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, ఏఆర్‌ ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుళ్లను శనివారం ఎస్పీ రోహిత్‌రాజ్‌ తన కార్యాలయంలో సత్కరించారు. ఎస్‌ఐ కసిబోయిన సత్యనారాయణరాజు, ఏఎస్‌ఐ జంపాల హనుమంతరావు, ఏఆర్‌ ఎస్‌ఐ ధారావత్‌ వెంకటేశ్వర్లు, హెడ్‌కానిస్టేబుల్‌ ఎట్టా శ్రీనివాసరావు సన్మానం పొందినవారిలో ఉన్నారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ మంజ్య, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, అడ్మిన్‌ ఆర్‌ఐ లాల్‌ బాబు, ఎంటీఓ సుధాకర్‌, వెల్ఫేర్‌ ఆర్‌ఐ కృష్ణ పాల్గొన్నారు.

ఒకరిపై అట్రాసిటీ కేసు

భద్రాచలంఅర్బన్‌: పట్టణంలోని రామాలయ పరిసర చప్టాదిగువ ప్రాంతానికి చెందిన శివపై శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. భద్రాచలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాజును శివ అకారణంగా ధూషించి, దాడి చేసి గాయపరిచాడు. శనివారం రాజు ఫిర్యాదు చేయగా.. శివపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రామకృష్ణ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement