మక్కలు తక్షణమే తరలించాలి | - | Sakshi
Sakshi News home page

మక్కలు తక్షణమే తరలించాలి

May 30 2026 12:23 AM | Updated on May 30 2026 12:23 AM

కలెక్టర్‌ అంకిత్‌

జూలూరుపాడు: మక్కలు తక్షణమే తరలించాలని కలెక్టర్‌ అంకిత్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. కొనుగోళ్లు, నిల్వలు, వర్షంతో రైతుల ఇబ్బందులపై ఆరా తీశారు. మక్కల లోడింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తహసీల్దార్‌ టి.శ్రీనివాస్‌, ఎంపీడీఓ తాళ్లూరి రవి, సొసైటీ కార్యదర్శి ఎల్‌.నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.

‘సర్‌’ వేగవంతం చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌–2026) కార్యక్రమాన్ని వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్‌, కలెక్టరేట్‌ నుంచి అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని చర్యలను తీసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement