కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని కొర్లగూడెం, ఖాన్‌ఖాన్‌పేట, పేరువంచ రేషన్ దుకాణాల్లో శనివారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొర్లగూడెం దుకాణంలో 12.5 క్వింటాళ్లు, పేరువంచలో 168 క్వింటాళ్లు, ఖాన్‌ఖాన్‌పేట రేషన్ దుకాణంలో 128 క్వింటాళ్ల బియ్యం రికార్డుల కంటే అదనంగా ఉన్నట్లు గుర్తించి మూడు దుకాణాలను సీజ్ చేశారు. అంతేకాక డీలర్లపై 6–ఏ కేసు నమోదు చేశారు. తనిఖీల్లో విజిలెన్స్ ఓఎస్డీ అంజయ్య, సివిల్ సప్లయీస్ ఆర్‌ఐ నరేశ్, ఏఎస్‌ఐ వెంకటకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
6.50 టన్నుల బియ్యం స్వాధీనం
మండలంలోని ముగ్గు వెంకటాపురం నుంచి ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్న 6.50 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామం నుంచి బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో శనివారం తెల్లవారుజామున జీపీఓ నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేశారు.
మూడు రేషన్ షాపులు సీజ్


