చుంచుపల్లి: పోడు సాగుదారులను అటవీశాఖ అధికారులు ఇబ్బంది పెట్టొద్దని, వారికి ఉపాధి లేకుండా చేసే చర్యలకు స్వస్తిచెప్పి సహకరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా డిమాండ్ చేశా రు. బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్‌కు వినతిపత్రం అందించి, సమస్యలను వివరించారు. బందెగిరినగర్‌తోపాటు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో పేదలు సాగు చేసుకుంటున్న భూములను లాక్కొనే యత్నాలు చేయొద్దని, సర్వే పూర్తయిన ప్రతి ఎకరాకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా పోడు చేయడాన్ని సీపీఐ వ్యతిరేకిస్తోందని, తరతరాలుగా పోడుపైనే ఆధారపడినవారికి హక్కు పత్రాలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బండి నర్సింహ, తాటి ఎల్లయ్య, సున్నం పాపారావు, ఆదిలక్ష్మి, వెంకటేశ్వర్లు, కుంజా వెంకటేశ్, పడిగె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ సీపీఐ..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా పోరాటాల స్ఫూర్తిని ఇంటింటికీ తీసుకెళ్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా అన్నారు. పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా బుధవారం జిల్లాలోని అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ప్రతి గడపకు వెళ్లి కమ్యూనిస్టుల పోరాటాలు, త్యాగా లను ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. 15వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి గ్రామంలోని సమస్యలను గుర్తించి, వాటి పరిష్కా రం కోసం కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, దుర్గరాశి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జి.వీరస్వామి, భూక్యా దస్రు, ఎస్‌కే ఫహీమ్, కుమారి హన్మంతరావు, ధీటి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.


